Breaking News

బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

కొత్త గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలకు భూమిపూజ.. 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం

బాన్సువాడ, అక్టోబర్ 28 (E6tv న్యూస్).

బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనసూయ సీతక్క శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు నూతనంగా నిర్మించిన భవనాలు, విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాన్సువాడ గ్రామీణ మండలం కొయ్యగుట్ట తాండలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు మంత్రి సీతక్క భూమిపూజ చేశారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అలాగే బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.ఈ అభివృద్ధి పనులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు దోహదపడనున్నాయి. ముఖ్యంగా మహిళా సంఘాలకు అవసరమైన భవన సదుపాయాలు అందుబాటులోకి రావడంతో వారి కార్యకలాపాలకు మరింత వెసులుబాటు కలగనుంది. విద్యుత్ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడం స్థానిక విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడనుంది.

ఈ కార్యక్రమాల్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, రాష్ట్ర మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, బాన్సువాడ మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *