భీంగల్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి).
భీంగల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పడిన రోడ్ల గుంతలను మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పూడ్చే చర్యలు చేపట్టారు. గుంతల్లో చిప్స్ పోసి బ్లేడ్ బండితో చదును చేసి రహదారిని శుభ్రం చేశారు.ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్లను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ పనులు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ బుదిరే నాగమణి స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ జైజై లత, జైజై నరసయ్య, కౌన్సిలర్లు పర్సా అనంతరావు, తోట సతీష్, సత్య, గంగయ్య, మొండి దినేష్ చంద్రం, మున్సిపల్ సిబ్బంది శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

