Breaking News

ప్రశాంత్ నగర్ డివిజన్‌లో బీజేపీలోకి యువత చేరిక

ప్రధాని మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆకర్షితులై పార్టీలో చేరిన యువకులు

ప్రశాంత్ నగర్, అక్టోబర్ 26 (E6 TV న్యూస్).

నిజామాబాద్ జిల్లా ప్రశాంత్ నగర్ డివిజన్ పరిధిలోని ఏవీబీపురానికి చెందిన పలువురు యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. యువ నాయకులు కార్తీక్, లక్ష్మణరావు నాయకత్వంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి యంజల పద్మయ్య ఆధ్వర్యంలో సోమవారం ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గిరి వర్ధన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మాధవరం కాంతారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరయ్యారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ పనితీరుపై ఆకర్షితులై యువకులు బీజేపీలో చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, యువత పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై బీజేపీలో చేరడం సంతోషకరమని అన్నారు. దేశాభివృద్ధి, ప్రజాసేవలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీలో నూతనంగా చేరిన యువకులకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వీరన్ కుమార్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *