డోంగ్లి, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి).
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో శుక్రవారం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రైతుల భూములు, సాగు చేస్తున్న పంటలు, ఇతర వ్యవసాయ వివరాలపై రైతులతో చర్చించారు.గ్రామంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని, రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
కార్యక్రమంలో ఏఈవో గజానంద్తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

