Breaking News

ఎల్బీనగర్‌లో యోగా: పాల్గొన్న మాజీ కార్పొరేటర్ నర్సింహారెడ్డి

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో భారతీయ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణను పెంపొందించే ప్రత్యేక యోగా శిక్షణా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన్సురాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. మిలటరీలో ఉండే క్రమశిక్షణ భారతీయ యోగా సంస్థాన్‌లోనూ కనిపిస్తుందని కొనియాడారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, జీవన విధానంలో నియమ నిబద్ధతను పెంచే సాధన అని పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా వివిధ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం నేర్పించిన శిక్షకులు.. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను పెంచేందుకు యోగా ఎంతో అవసరమని, ముఖ్యంగా యువత దీనిని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *