ఎల్లారెడ్డి, అక్టోబర్ 25 (E6tv న్యూస్).
లింగంపేట్ మండలానికి చెందిన బాయికాడి ఎంకవ్వ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకుడు సంపత్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఎంకవ్వ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ వారి బాధలో పాలుపంచుకున్నారు.ఈ పరామర్శ కార్యక్రమంలో లింగంపేట్ మండలానికి చెందిన దేమే అనిల్ కుమార్, సాయిలు, కాశీరం, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

