Breaking News

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

కమ్మర్‌పల్లి, అక్టోబర్ 26 (E6tv న్యూస్).

కమ్మర్‌పల్లి మండలంలోని అమీర్‌నగర్, కొనసముందర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్ రెడ్డి పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అమీర్‌నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త వర్ణం రాములు కుమారుడు వర్ణం నర్సయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలని సూచించారు.అనంతరం కొనసముందర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన దాసరి కమల కుటుంబ సభ్యులను పరామర్శించి, తన సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, సుంకేట రవి, బుచ్చి మల్లయ్య, పడిగెల ప్రవీణ్ రెడ్డి, మురళి, సంజీవ్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *