Breaking News

పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల వ్యూహం:ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో రెండు గంటల పాటు కీలక భేటీ నిర్వహించారు. 2024 అసెంబ్లీ పోరులా కాకుండా స్థానిక ఎన్నికల్లో ప్రాంతాల వారీగా పార్టీ సంపూర్ణ బలాన్ని అంచనా వేసి, ఎక్కడ ఏ పార్టీ క్యాడర్ బలంగా ఉందో అక్కడ ఆ పార్టీకే అవకాశం ఇచ్చేలా నయా సీట్ల సర్దుబాటు ఫార్ములాపై చర్చించారు. 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించడంతో ఎలక్షన్ నగారా మోగనుండగా, జనసేన ఇప్పటికే ప్రత్యేక కమిటీ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన ముమ్మరం చేసింది. గ్రామీణ, పట్టణ స్థాయిల్లో YSRCPని ధీటుగా ఎదుర్కొంటూ మేయర్, ZPTC, MPTC స్థానాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా NDA కూటమి సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *