Breaking News

కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్ల నిరాకరణ: మహేష్ గౌడ్ తీవ్ర ఆగ్రహం!

నవంబర్‌ 1న ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న మెగా ర్యాలీకి సన్నాహాలు ముమ్మరమవుతుండగా, ప్రత్యేక రైళ్ల కేటాయింపు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. తెలంగాణ నుంచి ర్యాలీకి తరలివెళ్లే కార్యకర్తల కోసం ప్రత్యేక రైళ్లను కేటాయించాలని ఎంపీలు అనిల్‌ యాదవ్‌, మల్లు రవి కోరినప్పటికీ, రైల్వే అధికారులు ఆరు రోజుల పాటు కాలయాపన చేసి చివరి నిమిషంలో నిరాకరించారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల ఒత్తిళ్ల వల్లే ఉద్దేశపూర్వకంగానే రైల్వే శాఖ రైళ్లను నిరాకరించిందని ఆయన ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ శ్రేణులు, నేతలు ఢిల్లీ ర్యాలీకి తరలిరాకుండా అడ్డుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. అయితే కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఢిల్లీకి చేరుకుని రామ్‌లీలా మైదానంలో తమ నిరసన గళాన్ని బలంగా వినిపిస్తారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *