Breaking News

దొంగిలించిన బంగారు ఉంగరం రికవరీ

చెన్నేకొత్తపల్లి పోలీసుల చాకచక్యం.. బాధితుడికి ఉంగరం అప్పగింత

చెన్నై కొత్తపల్లి, అక్టోబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి)

చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించబడిన బంగారు ఉంగరాన్ని పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నేకొత్తపల్లికి చెందిన రామకృష్ణ రాజు వద్దకు గతంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మాటల్లో మభ్యపెట్టాడు. తన తల్లికి ఇలాంటి ఉంగరం చేయించాలని ఉందని, రామకృష్ణ రాజు ధరించిన ఉంగరాన్ని ఒకసారి చూసి ఇస్తానని నమ్మించాడు. దీంతో రామకృష్ణ రాజు తన వద్ద ఉన్న సుమారు 3.5 గ్రాముల బంగారు ఉంగరాన్ని తీసి ఇవ్వగా, సదరు వ్యక్తి ఉంగరంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితుడు చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా బంగారు ఉంగరం చోరీకి పాల్పడిన వ్యక్తిని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం చెన్నేకొత్తపల్లి పోలీసులకు తెలియడంతో అక్కడి పోలీసులు కదిరికి వెళ్లి నిందితుడిని విచారించారు.నిందితుడి వద్ద నుంచి 3.5 గ్రాముల బంగారు ఉంగరాన్ని రికవరీ చేసి, చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో బాధితుడు రామకృష్ణ రాజుకు సబ్‌ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ స్వయంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మోహన్, బాధితుడు రామకృష్ణ రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *