Breaking News

భీంగల్ అభివృద్ధికి రూ.4 కోట్ల నిధుల కేటాయింపునకు కృషి

నూతన ఎమ్మార్వో, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి ముందడుగు

కాంగ్రెస్ ప్రభుత్వానికి మండల నాయకుల కృతజ్ఞతలు

భీంగల్, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి).

భీంగల్ మండల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవ, ఆదేశాలతో భీంగల్‌లో నూతన ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి రూ.1.75 కోట్ల నిధుల మంజూరు కోసం కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ రెండు కార్యాలయాల నిర్మాణానికి మొత్తం రూ.4 కోట్ల నిధుల మంజూరు కోసం చేపట్టిన ప్రయత్నాలతో మండలంలో పరిపాలనా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని, ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా నిధుల మంజూరుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలతో భీంగల్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సమావేశంలో పాల్గొన్న నాయకులు: ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బొదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ చంటి లతా, జేజే నరసయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, గోపాల్ నాయక్, సుంకారి సురేష్, మేకల శ్రీనివాసు, భూక్య రవి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *