Breaking News

ఎల్లారెడ్డి 7వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభం

రూ.5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మాణం

రాకపోకలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం

ఎల్లారెడ్డి, అక్టోబర్ 15 (E6tv న్యూస్).

ఎల్లారెడ్డి పట్టణంలోని 7వ వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాల్ సమీపంలో రూ.5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన ఈ రోడ్డును ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మత్తమాల భాగ్యవతి స్వాగతం పలికారు. వార్డులోని స్థానిక ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.రోడ్డు నిర్మాణంతో స్థానికులకు రాకపోకల్లో సౌలభ్యం కలగనుంది. పట్టణంలోని వార్డుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అభివృద్ధి పనులు దోహదపడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *