Breaking News

రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించాలి

మాలలకు 22వ స్థానం నుంచి 20వ స్థానానికి మార్చాలి.. బాన్సువాడలో మాల సంఘం శాంతియుత దీక్ష

బాన్సువాడ, అక్టోబర్ 16: (E6tv న్యూస్).

రోస్టర్ పాయింట్ విధానానికి వ్యతిరేకంగా, మాలలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో జరుగుతున్న నష్టాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ మాల సంఘం ఆధ్వర్యంలో బాన్సువాడ హెడ్‌క్వార్టర్స్‌లో ఒకరోజు శాంతియుత దీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ప్రస్తుతం రోస్టర్ పాయింట్ విధానంలో మాలలకు 22వ స్థానం కేటాయించడం వల్ల విద్య, ఉద్యోగ అవకాశాల్లో నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని సవరించి 22వ రోస్టర్ పాయింట్‌ను 20వ స్థానానికి మార్చాలని, రెండు పాయింట్లను మాలలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మాలలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.మాలల హక్కుల పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్ విధానంలో మార్పులు తీసుకువచ్చి విద్య, ఉద్యోగ రంగాల్లో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యాల సంతోష్, బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు మిర్జాపురం సాయన్న, పోతంగల్ మాల సంఘం అధ్యక్షుడు జ్యోతిపాల్, ఉపాధ్యక్షుడు కాలే సాయిలు, దోమలేడియా లక్ష్మణ్, కోడిచెర్ల అధ్యక్షుడు ప్రకాష్, కోడిచెర్ల సంఘం సభ్యులు, చైతన్ నగర్ ప్రకాష్, ఎత్తొండ క్యాంప్ గౌతమ్ నగర్ సర్పంచ్ అర్జున్, ఎత్తొండ గౌతమ్ నగర్ మాల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *