తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ నెల 12, 13, 14, 19, 20 తేదీలకు సంబంధించిన టికెట్లు అందుబాటులోకి రానుండగా, బ్రహ్మోత్సవాల వేళ స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందస్తుగా బుక్ చేసుకోవాలని దేవస్థానం సూచించింది. భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో దళారులు లేదా అనధికారిక వెబ్‌సైట్లను నమ్మకుండా కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు పొంది, కేటాయించిన సమయానికి అనుగుణంగా తిరుమలకు రావాలని టీటీడీ కోరింది.
టీటీడీ అప్‌డేట్:నేడు రూ.300 దర్శన టికెట్లు విడుదల

