Breaking News

వెంకన్న హుండీ ఆల్‌టైమ్ రికార్డు!

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి హుండీకి కానుకల రూపంలో రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. గత తొమ్మిది నెలల కాలంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఏకంగా రూ. 1,129.04 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో అత్యధికంగా రూ. 140.25 కోట్ల హుండీ ఆదాయం రాగా, ఆగస్టులో రూ. 137.44 కోట్లు, జూన్‌లో రూ. 128.30 కోట్లు మరియు సెప్టెంబర్‌లో రూ. 126.41 కోట్ల రాబడి నమోదైంది. ముఖ్యంగా సెప్టెంబర్ 10న ఒక్కరోజే అత్యధికంగా రూ. 6.94 కోట్ల కానుకలు హుండీకి వచ్చాయి. స్వామివారి దర్శనానికి విశేష సంఖ్యలో తరలివస్తున్న భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటుండటంతో నెలనెలా హుండీ ఆదాయం భారీ స్థాయిలో పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *