Breaking News

నిజామాబాద్‌ ఐడీఓసీ హెలిప్యాడ్‌కు రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

నిజామాబాద్‌, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా నిజామాబాద్‌ పర్యటనలో భాగంగా ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. గవర్నర్‌కు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పి. రాకేష్‌ రెడ్డి, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ జన్మదినం కావడంతో రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా…

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు బీజేపీ డిమాండ్

బాన్సువాడ, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల పక్షాన కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా “ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి” అంటూ నినాదాలు…

Read More

మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా తోట లక్ష్మీకాంతారావు

జుక్కల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ శాసనసభలో మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా కృషి చేస్తానని, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో…

Read More

మద్నూర్ ప్రజావాణిలో వినతుల స్వీకరణ

మద్నూర్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండీ ముజీబ్, ఎంపీవో సత్యనారాయణరెడ్డితో పాటు విద్యాశాఖ, పంచాయతీరాజ్, నీటిపారుదల, అటవీ, విద్యుత్, ఉపాధిహామీ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.ప్రజావాణిలో మేనూర్ గ్రామానికి చెందిన ఒక వినతిని స్వీకరించినట్లు ఎంపీడీవో సాయిలు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో…

Read More

మద్నూరును నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని వినతి

మద్నూర్, ఆగస్టు 25: (E6tv NEWS ప్రతినిధి). మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ మండల ప్రజలు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో సాయిలు, తహసీల్దార్ ముజీబ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. గతంలో మద్నూర్ మండలం నిజామాబాద్ జిల్లాలో ఉన్న సమయంలో పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల సేవలు సులభంగా అందుబాటులో ఉండేవని తెలిపారు. ప్రస్తుతం మద్నూర్ నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రం సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉండగా,…

Read More

22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సవాల్

ఇందూరు, ఆగస్టు 23: (E6tv NEWS: శివ ఠాకూర్). 22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఇందూరు జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా తాను అక్కడికి వచ్చి చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. 22-A భూముల అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చర్చకు…

Read More

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి.. వ్యక్తిగత దూషణలకు తావులేదు ఎంపీ అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 23: (E6 tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కారానికి విరుద్ధమని ఆయన…

Read More

పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ సిబ్బంది

మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి). వన మహోత్సవంలో భాగంగా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో శనివారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 200 ఈత మొక్కలు నాటారు. బిచ్కుంద ఆబ్కారీ శాఖ, గౌడ సంఘం, గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా ఆబ్కారీ అధికారి ఈఎస్ ముకుందరెడ్డి ఆదేశాల మేరకు మొక్కలు నాటినట్లు ఎక్సైజ్ ఎస్ఐ నాగేష్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి

కామారెడ్డి, ఆగస్టు 22: (E6tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నవజాత శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో ప్రసవం చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటలకు స్వరూప అనే బాలింతను ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు తీవ్ర ప్రసవ నొప్పులు ఉన్నప్పటికీ వైద్యులు వెంటనే…

Read More

భీంగల్‌లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

భీంగల్, ఆగస్టు 21:(E6tv NEWS:ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డులోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య…

Read More