Breaking News

బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి జైలు శిక్ష

పోక్సో కేసులో ఏడేళ్ల జైలు.. రూ.20 వేల జరిమానా నిజామాబాద్, అక్టోబర్ 23 (E6tv న్యూస్). బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ నిజామాబాద్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ జడ్జి దుర్గాప్రసాద్ తీర్పు ఇచ్చినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021 సెప్టెంబర్‌లో నిజామాబాద్‌లోని ఒక ప్రాంతంలో ఐదేళ్ల…

Read More

ఆర్మీ జవాన్లకు అండగా నిలిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకారం.. ఎమ్మెల్యేకు, గ్రామ పెద్దలకు జవాన్ల కృతజ్ఞతలు అక్బర్ నగర్, అక్టోబర్ 23 (E6tv న్యూస్). దేశ రక్షణలో నిరంతరం సేవలందిస్తున్న ఆర్మీ జవాన్లకు అండగా నిలిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులకు అక్బర్ నగర్ గ్రామానికి చెందిన జవాన్లు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన సుమారు 10 నుంచి 20 మంది వరకు ఆర్మీ జవాన్లు దేశ…

Read More

విమర్శలకు మౌనమే సమాధానం.. ప్రజాసేవే పోచారం బలం!

బాన్సువాడ రాజకీయాల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక శైలి.. తండ్రి బాటలో తనయులు బాన్సువాడ, అక్టోబర్ 23 (E6tv న్యూస్). రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే ఎన్ని విమర్శలు ఎదురైనా సంయమనంతో వ్యవహరించడం, ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగడం తన రాజకీయ శైలిగా భావించే నాయకుల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకరని ఆయన అనుచరులు, అభిమానులు చెబుతున్నారు. ప్రత్యర్థుల వ్యాఖ్యలకు వెంటనే స్పందించకుండా మౌనంగా ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉండటానికే ప్రాధాన్యత…

Read More

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి వ్యాసరచన పోటీలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి వ్యాసరచన పోటీలు ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (E6tv న్యూస్). పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్లారెడ్డి పోలీస్ సర్కిల్ పరిధిలోని సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వ్యాసరచన పోటీల్లో ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం…

Read More

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎండీఆర్ ఫౌండేషన్

ఆర్థిక సహాయం అందించిన ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్ పటాన్‌చెరు, అక్టోబర్ 23 (E6tv NEWS). మానవత్వమే లక్ష్యంగా ఎండీఆర్ ఫౌండేషన్ మరోసారి తన సేవా నిరతిని చాటుకుంది. బీహెచ్ఈఎల్ ఎక్స్ రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్ అందజేశారు. అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చని…

Read More

విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దసరా పురస్కారాల మహోత్సవం

విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కిరణ్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయం: కంజర్ల కృష్ణమూర్తి చారి పటాన్‌చెరు, అక్టోబర్ 23 (E6tv న్యూస్). విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో దసరా పురస్కారాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విశ్వబ్రాహ్మణులకు ఈ సందర్భంగా పురస్కారాలను అందజేసి సత్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఏసీపీ కిరణ్ కుమార్, గౌరవాధ్యక్షులు ఇడికోజు వెంకటాచారి, అధ్యక్షులు డాక్టర్…

Read More

VDC కమిటీల రద్దుకు మోకుదెబ్బ ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం – అమరవేణి నర్సాగౌడ్ ఆర్మూర్, అక్టోబర్ 23 (E6tv న్యూస్). VDC గ్రామ అభివృద్ధి కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో గీత కార్మికులు, దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయని…

Read More

కొక్కొండలో సారీ ఫంక్షన్ సందడి.. చిన్నారులకు సుభాష్ రెడ్డి ఆశీస్సులు!

ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామంలో సారీ ఫంక్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ముత్యం కుమార్తెలు సౌమ్య, స్పందన, సాత్వికల సారీ ఫంక్షన్ శుక్రవారం వారి నివాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సందడిగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చిన్నారులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు….

Read More

కరెంట్ కోతలు – నీటి ఎద్దడి: రైతులకు తప్పని పంట నష్టం భయం!

తెలంగాణలో నిరంతర విద్యుత్ కోతలు, సాగునీటి కొరత వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్లముందే చేతికొచ్చిన వరి పంట ఎండిపోతుండటంతో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైపూర్ మండలం మిట్టపల్లిలో ఎండిపోతున్న పొలానికి ట్యాంకర్ల ద్వారా నీరు పారిస్తుండగా, వెల్గనూర్ గ్రామానికి చెందిన రైతులు కరెంట్ కోతలను తట్టుకోవడానికి డీజిల్ జనరేటర్లను సిద్ధం చేసుకుంటున్నారు. డీజిల్ ఖర్చు తమకు అదనపు భారంగా మారుతోందని, పంటల దిగుబడి తగ్గిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు….

Read More

అమ్మమ్మ 100వ జన్మదినోత్సవానికి మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల శుభాకాంక్షలు

నిజామాబాద్, అక్టోబర్ 23 (E6tv NEWS: శివ ఠాకూర్). గందె కళావతి అమ్మమ్మ 100వ జన్మదినోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ, ఒక శతాబ్దపు జీవిత ప్రయాణం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. వందేళ్ల జీవితంలో ఎన్నో అనుభవాలు, మధుర జ్ఞాపకాలు, కుటుంబ విలువలు, ప్రేమానురాగాలు మిళితమై ఉంటాయని అన్నారు.కుటుంబ సభ్యులకు అమ్మమ్మ అందించిన ప్రేమ, ఆప్యాయతలు, విలువలు, ఆశీర్వాదాలు…

Read More