ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (E6tv న్యూస్)
లింగంపేట్ మండలం మాలపాటి గ్రామానికి చెందిన సంజీవ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందడంతో, శుక్రవారం నిర్వహించిన దినకర్మ కార్యక్రమం సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారి నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంజీవ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

