బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రిలో రోగులకు అన్నప్రసాద వితరణ
రుద్రూర్, అక్టోబర్ 26 (E6tv న్యూస్).
రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వ్యవస్థాపక సభ్యులు లయన్ ఇందూర్ చంద్రశేఖర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బోధన్‌లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి ఆపరేషన్లు చేయించుకున్న రోగులకు, వారి సహాయకులకు, రోజువారీ ఓపీకి వచ్చిన రోగులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ, లయన్ ఇందూర్ చంద్రశేఖర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా పేద రోగులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని, సేవా కార్యక్రమాల ద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.సేవాభావంతో నిర్వహించిన ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆసుపత్రికి వచ్చిన రోగులకు, వారి సహాయకులకు ఉపయోగకరంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో జీఎస్‌టీ కోఆర్డినేటర్ లయన్ శ్యాంసుందర్ పహాడే, జిల్లా చైర్మన్ లయన్ కె.వి. మోహన్, క్లబ్ కోశాధికారి లయన్ పార్వతీ ప్రశాంత్, డైరెక్టర్ లయన్ పుట్టి సాగర్, దుర్గాదేవి కమిటీ అధ్యక్షులు ఇందూర్ కార్తీక్, రుద్రూర్ గ్రామ వార్డు సభ్యులు ఆమంద్ వెంకటేశ్వర్, పాత్రికేయులు బాబు తదితరులు పాల్గొన్నారు.




