Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. హెల్మెట్ ఉంటే ప్రాణం దక్కేది!

జగిత్యాల, అక్టోబర్ 28 (E6tv న్యూస్).

జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన నూతి పెళ్లి అక్షయ్ అలియాస్ శివకుమార్, రంగాపూర్–భీమారం గ్రామాల మధ్య తాను నడుపుతున్న పల్సర్ బైక్ అదుపుతప్పి స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు కావడంతో యువకుడు మృతి చెందాడు.

ఈ ఘటనపై మేడిపల్లి ఎస్ఐ ఎం. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. యువకుడు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కే అవకాశం ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పలుమార్లు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు.అజాగ్రత్త, అతివేగం కారణంగా ప్రమాదాలు జరిగి కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోతున్నాయని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. నిర్ణీత వేగంతో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *