Breaking News

కొడుకుని చూసి గర్విస్తున్నా: సీఎం విజయ్‌ తండ్రి

తమిళనాడు రాజకీయాలు, అసెంబ్లీ వేదికగా చోటుచేసుకుంటున్న పరిణామాల వేళ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్‌.ఏ. చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న వ్యక్తిగత అభిప్రాయభేదాల ప్రచారానికి స్వస్తి పలుకుతూ, తన కుమారుడి రాజకీయ ప్రయాణానికి, వైఖరికి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు.

ఎస్‌.ఏ. చంద్రశేఖర్ వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు:

  • గర్వంగా ఉంది: రాజకీయాల్లో, శాసనసభ వేదికగా విజయ్ వ్యవహరిస్తున్న తీరు, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతున్న విధానం చూస్తుంటే ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉందన్నారు.
  • మహిళల గౌరవానికి ప్రాధ్యానం: మహిళల ఆత్మగౌరవం, రాజకీయ మర్యాదల విషయంలో విజయ్ తీసుకున్న స్పష్టమైన నిర్ణయాలు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు.
  • చవకబారు ఆరోపణలు చెల్లవు: తమ కుటుంబాన్ని, విజయ్ వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న అబద్ధపు వ్యాఖ్యలను తమిళనాడు ప్రజలు ఎప్పటికీ నమ్మరని తేల్చిచెప్పారు.

గతంలో విజయ్ మరియు ఆయన తండ్రి మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరిగిన ప్రచారానికి ఈ వ్యాఖ్యలతో తెరపడింది. తండ్రి నుంచి వచ్చిన బహిరంగ మద్దతుతో టీవీకే (TVK) శ్రేణుల్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర ఉత్సాహం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *