Breaking News

ఆర్మీ చీఫ్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ:ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్లాన్

శ్రీశైలం ఎడమ కాలువ (SLBC) టన్నెల్ నిర్మాణం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యానికి చెందిన ఇంజినీరింగ్ విభాగం అధికారుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్‌తో ప్రత్యేకంగా సమావేశమై అభ్యర్థించారు. రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ లెఫ్టినెంట్ కర్నల్ సత్యదేవ్ సింగ్, లెఫ్టినెంట్ కర్నల్ రంజిత్ మీనన్, లెఫ్టినెంట్ కర్నల్ భల్లా పేర్లను డిప్యూటేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపింది.

ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో మిగిలిన పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ఒక ఆర్మీ అధికారిని కేటాయించనున్నారు. అలాగే ఎన్డీఎస్ఏ (NDSA) సిఫార్సుల మేరకు జరుగుతున్న కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు మిగిలిన ఇద్దరు సైనికాధికారుల సేవలను వాడుకోనున్నారు. ఆర్మీ ఇంజినీర్ల అనుభవం, క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలు పెరగడంతో పాటు నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *