Breaking News

రెండు రాష్ట్రాల్లో ‘చెడ్డీ గ్యాంగ్’ చోరీల కలకలం!

తెలుగు రాష్ట్రాల్లో ‘చెడ్డీ గ్యాంగ్’ల సంచారం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లోకి చొరబడిన దుండగులు చోరీకి యత్నించడంతో పాటు, అడ్డుకున్న మహిళపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ సంఘటన మరవక ముందే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శివార్లలోనూ చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. తిరుచానూరు పరిధిలోని కొత్తపాలెం ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ముఖానికి మాస్కులు, చెడ్డీలు ధరించిన ఐదుగురు దుండగులు చేతుల్లో ఆయుధాలతో సంచరిస్తూ, ఒక కుక్కను తరుముతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. స్థానికుల భయాందోళనల మధ్య సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *