Breaking News

ఈసారి చలి తక్కువే.. వేడెక్కుతున్న శీతాకాలం!

దేశంలో నైరుతి రుతుపవనాల కాలం ముగియడంతో భారత వాతావరణ శాఖ (IMD) ఈ ఏడాది శీతాకాలంపై కీలక అంచనాలను వెలువరించింది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ శీతాకాలంలో చలి తీవ్రత తక్కువగా ఉండి, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వర్షాకాలం మొత్తంగా 13 శాతం లోటు వర్షపాతంతో ముగియగా, పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల ఏర్పడిన ఎల్‌నినో 2027 ప్రారంభం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అయితే దక్షిణ భారతదేశానికి ఈశాన్య రుతుపవనాల ద్వారా కొంత ఊరట లభించనుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలంలో దేశమంతటా పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ, దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *