Breaking News

బడి పిల్లలకు పౌష్టికాహారం: స్కూల్ బ్రేక్‌ఫాస్ట్‌పై సీఎం రేవంత్ !

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాహారం (బ్రేక్‌ఫాస్ట్) అందించే పథకం అమలు దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో కీలక ఒప్పందాలు కుదిరాయి. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు ముందుకు వచ్చాయి. సీఎండీ శేఖర్ రెడ్డి (జున్నా సోలార్) రూ. 5.17 కోట్లు, చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు రూ. 4 కోట్ల చెక్కులను సీఎం చేతుల మీదుగా హరేకృష్ణ ఫౌండేషన్‌కు అందించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు:

  • డిసెంబర్ 9 నాటికి ప్రారంభం: రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ల ఏర్పాటు పనులను నవంబర్ 30 నాటికి పూర్తి చేసి, డిసెంబర్ 9 నాటికి ఒకేసారి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
  • విద్యార్థుల హెల్త్ ట్రాకింగ్: ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల శారీరక పెరుగుదల, విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు నమోదు చేసేలా ప్రత్యేక ట్రాక్ రికార్డు నిర్వహించాలని, ఆహారంలో కేలరీలను లెక్కించేందుకు డిజిటల్ యాప్‌లను ఉపయోగించాలని సూచించారు.
  • ప్రాంతీయ రుచులు & నాణ్యత: స్థానిక అలవాట్లకు అనుగుణంగా ఉపాహారాన్ని అందించాలని, ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం ఈ సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌కు అనుసంధానించాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *