Breaking News

అహింస, శాంతి మార్గమే మన బాట: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన గాంధీజీ ఆశయాల స్ఫూర్తితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, వివక్ష లేని సమాజ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాడ్సే భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, దేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను వక్రీకరించేందుకు కొన్ని శక్తులు చేస్తున్న కుట్రలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గాంధీజీ మార్గంలోనే విద్యార్థులందరికీ కులమతాలకు అతీతంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ను ఏర్పాటు చేస్తున్నామని, వివక్షకు తావులేని సమసమాజ స్థాపనే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *