భారత నౌకాదళానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన మహిళా ఇంటెలిజెన్స్ ఏజెంట్‌కు చేరవేసిన ఆరోపణలతో 31 ఏళ్ల ప్రదీప్ ముఖర్జీ అనే నేవీ సైలర్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు ‘ఐఎన్ఎస్ అగ్రణి’లో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సదరు మహిళ హనీట్రాప్ చేయడంతో విశాఖ నౌకాదళ బేస్, యుద్దనౌకల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎంతవరకు సమాచారం పొక్కెంది, ఇంకా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు వేగవంతం చేశాయి.
పాక్ ఏజెంట్‌తో ప్రేమాయణంలో నేవీ సైలర్:దేశభద్రతకే ముప్పు?

