Breaking News

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం!

తిరుమల అలిపిరి నడక మార్గంలోని మోకాలిమిట్ట ప్రాంతంలో వేకువజామున రెండు గంటల సమయంలో చిరుతపులి కనిపించడం కలకలం రేపింది. మెట్ల పక్కనే కొంతసేపు సంచరించిన చిరుతను గుర్తించిన టీటీడీ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో నడక మార్గంలో భక్తులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ట్రాప్, సోలార్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు.. నడక మార్గంలో నిఘాను మరింత పెంచారు. భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని, నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణిస్తూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *