నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 07 (E6tvNEWS ప్రతినిధి)
నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన నుక్కని పోచయ్య (44) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే పోచయ్య గత కొంతకాలంగా మద్యానికి బానిసైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో భార్యతో గొడవ జరిగినట్లు సమాచారం.
మంగళవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో బొల్లారం చెరువు కట్టపైకి వెళ్లిన పోచయ్య అక్కడ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు.మృతుడికి భార్య స్వరూప, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇప్పటికే వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.



