Breaking News

ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత

భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విలక్షణ నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గోవాలోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు బతికించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తెల్లవారుజామున 5:20 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

1978లో ‘గమన్’ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన నానా పటేకర్, తన విలక్షణమైన డైలాగ్ డెలివరీ, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్కమ్’ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాల్లో సీరియస్, కామెడీ పాత్రలతో అలరించిన ఆయన, మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’లో అద్భుత నటన కనబరిచారు. తన సుదీర్ఘ నట ప్రస్థానంలో మూడు జాతీయ అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు పొందడమే కాకుండా 2013లో భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ అవార్డును అందుకున్నారు. నటుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగానూ రాణించిన నానా పటేకర్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *