Breaking News

లింగంపేట్ మండలంలో లబ్ధిదారునికి CMRF చెక్కు పంపిణీ

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట – సాయిరాం యాదవ్

ఎల్లారెడ్డి, అక్టోబర్ 17 (E6tv న్యూస్).

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలంలో బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును పంపిణీ చేశారు. లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరాం యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారునికి చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా సాయిరాం యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో మండలంలోని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లింగంపేట్ టౌన్ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ ప్రసాద్ గౌడ్, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి రఫీయొద్దీన్, టౌన్ సర్పంచ్ కోవడ రవీందర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా బాలకిషన్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు యాళ్లమయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు దూర్షిట్ అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్ ఎదుల్ లక్ష్మీనారాయణ, జక్షాన్ని రవి, వార్డు సభ్యురాలు సునీల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *