గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులకు కొంత ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్‌తో పాటు ఇతర పట్టణాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,47,430 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 1,35,140 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,10,570గా నమోదైంది. ఇక పసిడి బాటలోనే వెండి ధర కూడా కాస్త దిగివచ్చి, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండిపై రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ. 2,29,900 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,47,580గా ఉండగా, మార్కెట్ హెచ్చుతగ్గుల దృష్ట్యా కొనుగోలుదారులు స్థానిక జ్యువెలరీ దుకాణాల్లో ధరలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

