బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తీవ్ర తుపాను తెలుగు రాష్ట్రాలపై ప్రతాపం చూపుతోంది. ఈ తుపాను బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్-యానాం మధ్య (దిశ మారితే నెల్లూరు-మచిలీపట్నం మధ్య) తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ కాగా.. సూర్యాపేట, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా అక్టోబర్ 28న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీలకు కలెక్టర్ అంకిత్ సెలవు ప్రకటించారు. గురువారం నాటికి ఈ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలకూ విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణపై అర్నబ్ ఎఫెక్ట్..పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు!

