దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8.08 పాయింట్లు తగ్గి 73,598.87 వద్ద, నిఫ్టీ 3.45 పాయింట్లు నష్టపోయి 22,749.75 వద్ద స్థిరపడ్డాయి. ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ, విస్తృత మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1 శాతం, స్మాల్‌క్యాప్ 100 సూచీ 2.70 శాతం చొప్పున లాభపడ్డాయి. ముఖ్యంగా ఫార్మా, రియల్టీ, మీడియా రంగాలు 2 నుంచి 3 శాతం వరకు లాభాలను నమోదు చేశాయి. భారతీ ఎయిర్‌టెల్, ట్రెంట్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ముగియగా.. టీసీఎస్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. సాంకేతిక సంకేతాల ప్రకారం నిఫ్టీ 22,800 నిరోధాన్ని దాటితే 23,000 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు.. లాభాల్లో ఫార్మా, రియల్టీ షేర్లు

