Breaking News

రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి

పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: ధర్మవరం ఆర్డీఓ ఓ. రామ భూపాల్ రెడ్డి చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి).ప్రజలకు రెవెన్యూ సేవలను నిర్ణీత గడువులోగా అందించాలని ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఓ. రామ భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డివిజన్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండల కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆర్డీఓ.. పెండింగ్ దరఖాస్తులు, పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు,…

Read More

హార్టీకల్చర్ హబ్‌తో రాయలసీమ అభివృద్ధి: మంత్రి సవిత

రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్‌.. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు శ్రీకారం పులివెందులలో భారీ ట్రాక్టర్ ర్యాలీ.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన మంత్రి పులివెందుల/కడప: సెప్టెంబర్ 30 (E6tv NEWS: ప్రతినిధి). రాయలసీమలో రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్న హార్టీకల్చర్ హబ్‌తో ఉద్యానవన సాగులో ప్రాంతం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత తెలిపారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మదనపల్లెలో…

Read More

8వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా నూతన బోరు

మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో పనులు ప్రారంభం 100 అడుగుల లోతులోనే నీటి లభ్యత.. 3 ఇంచుల మేర నీరు ధర్మవరం, సెప్టెంబర్ 29:(E6tv NEWS:ప్రతినిధి) ధర్మవరం పట్టణంలోని 8వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా నూతన బోరు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. వార్డులో నెలకొన్న నీటి సమస్యను స్థానికులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల…

Read More

జమ్మలమడుగులో మెగా మెడికల్ క్యాంపు ప్రారంభం

జమ్మలమడుగు, సెప్టెంబర్ 29: (E6tv NEWS: ప్రతినిధి). ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా ప్రస్థానం, పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ ఉత్సవాల్లో భాగంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోటరీ క్లబ్‌లో దేవగుడి శంకర్‌రెడ్డి, సుబ్బరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి, బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి…

Read More

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలి: బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

కొత్తగూడెం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతినిధి). డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం గతంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 2023లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ, పాత కొత్తగూడెం ప్రాంతాల్లో డబుల్…

Read More

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

లేపాక్షి, సెప్టెంబరు 28:(:E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ లేపాక్షి మండల కేంద్రంలో రైతులు, వ్యవసాయ కూలీలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో మహాధర్నాలో పాల్గొనాలని సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు నరసింహప్ప…

Read More

అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో వైద్య సేవలను పరిశీలించిన హరీష్ బాబు

ధర్మవరం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతిని) ధర్మవరం పట్టణ ప్రజలకు అందుతున్న ప్రాథమిక వైద్య సేవలు, ఆసుపత్రిలోని సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జి హరీష్ బాబు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్‌లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను హరీష్ బాబు సందర్శించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించడంతో పాటు, చికిత్స కోసం వచ్చిన ప్రజలను…

Read More

చిత్తూరులో మళ్లీ ఏనుగుల భయం..అధికారులను అప్రమత్తం చేసిన పవన్ కల్యాణ్

అడవుల్లో ఏనుగుల సంచారంపై అటవీశాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల కదలికలు, ప్రజల భద్రతపై సోమవారం ఆయన అటవీశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవాసాల్లోకి వచ్చే ఏనుగులు మనుషులపై దాడులు చేయకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. ముఖ్యమైన ఆదేశాలు & ముఖ్యాంశాలు:

Read More

భగత్ సింగ్ త్యాగం చిరస్మరణీయం: మంత్రి సవిత

పెనుకొండ, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి) దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఘన నివాళులు అర్పించారు. భగత్ సింగ్ విగ్రహానికి మంత్రి సవితమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగం, ఆయన చూపిన ధైర్యం, నిస్వార్థ దేశభక్తి చిరస్మరణీయమని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన…

Read More

అభివృద్ధే మా అజెండా.. ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం

25 ఎకరాల్లో త్వరలో ఇళ్ల పట్టాల పంపిణీ – మహాదేవపల్లిలో రూ.45 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ పెనుకొండ, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ప్రజలతోనే కూటమి ప్రభుత్వం.. ప్రజల కోసమే పాలన సాగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని…

Read More