Mahaboobnagar
BRS కార్యకర్తపై దాడి.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
పిట్లం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన BRS కార్యకర్త శివపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. దాడిలో గాయపడిన శివకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలు అభివృద్ధి చేస్తారని…
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి) సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఇందూర్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజల…
సేవాలాల్ సేన 12వ వార్షికోత్సవం ఘనంగా
మద్రాస్ తండలో జెండా ఆవిష్కరణ.. బంజారా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలి టేకులపల్లి, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండ గ్రామంలో సేవాలాల్ సేన 12వ వార్షికోత్సవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు.సేవాలాల్ సేన సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన…
కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా
నిజామాబాద్, సెప్టెంబర్ 9: (E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రముఖ తెలంగాణ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. రాములు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాళోజీ నారాయణరావు గారు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తన రచనలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి, తెలంగాణ…
ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు
25 మంది స్వచ్ఛందగా రక్తదానం నిజామాబాద్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా నిజామాబాద్ మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, హైకోర్టు అడ్వకేట్ పుల్లెల శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన…
దళిత స్పీకర్‌పై అసభ్య పదజాలం సరికాదు
బీఆర్ఎస్ నేతల దురహంకారానికి పరాకాష్ట.. బాల్కొండలో తాతా మధు, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం బాల్కొండ, సెప్టెంబర్ 8: (E6 tv NEWS: ప్రతినిధి). శాసనసభ ఆవరణలో ఎమ్మెల్సీ తాతా మధు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి అసభ్యకర, అభ్యంతరకర పదజాలం ఉపయోగించడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు, ఈ ఘటనకు…
స్పీకర్‌ను దూషించిన ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలి
కమ్మర్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కమ్మర్పల్లి, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మంగళవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన…
గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రతిపాదిత స్థలాల పరిశీలన
పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సాంకేతిక నిపుణుల బృందం రెండు రోజులుగా ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తోంది. విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలతపై భౌగోళిక, భౌతిక, సాంకేతిక అంశాలను బృందం సమగ్రంగా అధ్యయనం చేస్తోంది.మంగళవారం ములకలపల్లి మండలం తిమ్మంపేటలో కొనసాగుతున్న పరిశీలనను జిల్లా కలెక్టర్ అంకిత్ ఏఏఐ సాంకేతిక బృందంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో గుర్తించిన…
జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారుల ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా షూటింగ్ క్రీడకు మరో ఘనత లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన బాలికల విభాగంలో, కొమరోజు శ్రీరామ్ బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కేరళలోని త్రివేండ్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తున్న సౌత్‌జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్-2026 అర్హత పోటీల్లో భావన, శ్రీరామ్…
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో 40 మందికి వాషింగ్ మిషన్ల పంపిణీ
మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మద్నూర్ పోస్టు కార్యాలయంలో 40 మంది అర్హులైన లబ్ధిదారులకు వాషింగ్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు తెప్పవార్ తుకారాం, బీజేపీ యువ నాయకుడు అజయ్ తమ్మేవార్ తెలిపారు. మద్నూర్ పోస్టు కార్యాలయానికి విశ్వకర్మ యోజనలో భాగంగా 40 వాషింగ్ మిషన్లు మంజూరు కాగా, అర్హులైన లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఈ మిషన్లు లబ్ధిదారుల జీవనోపాధికి,…

