హైదరాబాద్ నగరంలో అక్రమ వన్యప్రాణి ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గురువారం భారీ సోదా నిర్వహించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో ఏనుగు దంతాల విక్రయం జరుగుతోందన్న పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా దాడి చేసిన డీఆర్‌ఐ అధికారులు, అక్రమంగా విక్రయించడానికి యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి సుమారు 17 కేజీల బరువున్న నాలుగు పెద్ద ఏనుగు దంతాలతో పాటు, అత్యంత నైపుణ్యంతో చెక్కిన పలు దంతపు కళాఖండాలను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 (Wild Life Protection Act, 1972) నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్న దంతాలు, కళాఖండాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

