Breaking News

గాల్లో విమానాన్ని కూల్చేసే కుట్ర: ఫ్లైదుబాయ్ షాకింగ్ ఘటన!

దుబాయ్ నుంచి ఇస్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ (Flydubai 1073) విమానంలో తీవ్ర తీవ్రవాద కుట్ర వెలుగుచూసింది. విమానంలో సహ పైలట్ (ఫస్ట్ ఆఫీసర్)గా విధులు నిర్వర్తిస్తున్న ఒమన్ జాతీయుడు హమామ్ అల్-హమ్మమీ, భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నించాడు. ఇస్రాయెల్‌లోని బెన్ గురియాన్ విమానాశ్రయంలో విమానాన్ని ఏదైనా భవనాన్ని లేదా మరో విమానాన్ని ఢీకొట్టి 9/11 తరహా దాడికి ప్లాన్ చేసినట్లు నిందితుడు యూఏఈ అధికారుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

జోర్డాన్ మీదుగా విమానం ఇస్రాయెల్ వైపు వెళ్తుండగా కెప్టెన్‌పై దాడి జరగగా, తీవ్ర గాయాలైనప్పటికీ కెప్టెన్ స్మిత్ ధైర్యంగా పోరాడి కాక్‌పిట్ తలుపులు తెరిచారు. వెంటనే ప్రయాణికులు, సిబ్బందితో పాటు విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు స్పందించి కుట్రదారుడిని బంధించారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలోని 172 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, గాయపడిన కెప్టెన్ మరియు ఇద్దరు సిబ్బందికి చికిత్స అందిస్తున్నారు. కాగా, నిందితుడికి అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *