Breaking News

సొహ్రాబుద్దీన్ కేసు:సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన సీపీఐ నేత నారాయణ

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో 22 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కింది కోర్టులు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడాన్ని సీపీఐ సీనియర్ నేత కె. నారాయణ స్వాగతించారు. విచారణ సమయంలో ఏకంగా 92 మంది సాక్షులు మాట మార్చడంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ… సొహ్రాబుద్దీన్, ఆయన భార్య కౌసర్ బీ, తులసీరామ్ ప్రజాపతి హత్యలపై సమగ్ర న్యాయ సమీక్ష జరగాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో, గతంలోనే డిశ్చార్జ్ అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గతంలో ఈ కేసు విచారణ చేపట్టిన జడ్జి బి.హెచ్. లోయా మరణం తీవ్ర వివాదాస్పదమైన విషయాన్ని నారాయణ గుర్తుచేశారు. కేసు విచారించే న్యాయమూర్తులు ఎలాంటి ఒత్తిళ్లు, భయాందోళనలకు గురికాకుండా స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వారికి ప్రత్యేక భద్రత కల్పించాలని నారాయణ విజ్ఞప్తి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *