అమీన్‌పూర్‌లో ‘హైడ్రా’ గర్జన: రూ. 15,000 కోట్ల విలువైన 861 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
Hyderabad: నగర శివారులోని భూమాఫియా గుండెల్లో ‘హైడ్రా’ (HYDRAA) వణుకు పుట్టిస్తోంది. దశాబ్దాలుగా కబ్జాల చెరలో ఉన్న విలువైన ప్రభుత్వ ఆస్తులను రక్షించే క్రమంలో భాగంగా, శనివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఒక భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఏకంగా 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది. స్వాధీనం చేసుకున్న ఈ భూమి బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 15 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.ఆపరేషన్ ముఖ్యాంశాలు:ప్రభుత్వ…

