కులాలు ప్రాంతాలు రాజకీయాలను పక్కనపెట్టి మనం హిందువులమని భావించి జీవించినప్పుడు మన దేశాన్ని, ధర్మాన్ని, ఆలయాన్ని కాపాడుకోగలమని మాడుగుల శశిభూషణ సోమయాజి గురుజి అన్నారు. ప్రగతి నగర్ కాకతీయ హిందూ మహా సమ్మేళన ఉత్సవ సమితి అధ్యక్షులు పవన్ దొడ్డ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాడుగుల శశిభూషణ సోమయాజి గురూజీ , డాక్టర్ భువనేశ్వరి మారేపల్లి, వాసు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూ మహాసమ్మేళన ఈ కార్యక్రమంలో చిన్నారుల భరతనాట్యం ,భక్తి పాటలు, హనుమాన్ చాలీసా, మహిళల కోలాటం ఎంతో అలరించాయి వారు చేసిన నృత్యాలకు అక్కడికి వచ్చినవారు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో సుమారుగా ప్రతి గ్రామంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారని హిందూ సమ్మేళనానికి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు .ప్రగతి నగర్ లో కాకతీయ హిందూ మహాసమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఇంత మంది హిందూ బంధువులు పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. గతంలో మనం హిందువులమని చెప్పుకోవడానికే సిగ్గుపడేవారమని ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను హిందువును అని గల్ల ఎగరవేసుకొని చెబుతున్నారన్నారు. మనం కులం ,మతాన్ని, గడప లోపలనే వదలాలని మనం బయటికి వచ్చినప్పుడు అందరం హిందువులు మని గుర్తించుకోవాలని హిందూ సమాజం పట్ల గౌరవం ఏకాత్మత భావన ధర్మం పట్ల అంకితభావం సేవ భావం వంటి వాటిని మనం పాటించినప్పుడు మన హిందూ ధర్మం నిలబడుతుందన్నారు. ప్రపంచంలోని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బాంగ్లాదేశ్ ,చైనా వంటి దేశాలు భారతదేశంలోని ప్రదేశాలే అని ఆ దేశాలలో సరైన హిందువులు లేకనే అక్కడ వేరే వారు ఆ దేశాలను వెళుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా హిందువులందరూ ఒకటిగా ఉండి భారతదేశాన్ని రక్షించుకుందామన్నరు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ యొక్క హిందూ సమ్మేలానికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ హిందూ మహాసమ్మేళన సమితి సభ్యులు అధ్యక్షులు దొడ్డ పవన్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతీ జైన్, ఉప్పాల వంశీగుప్తా,విజేత, వ్యవస్థా ప్రముఖులు సంతోష్,సాత్విక్ ,నరేష్ గుప్త , మహా లక్ష్మి,రాజు,
స్వాగత కమిటీ సభ్యులు నరేంద్ర చౌదరి, ప్రొఫెసర్. చంద్రమోలి,విజేత, చక్రధర్, సుమన్ రావు,శివ కుమార్ గుప్త,శ్రీధర్ రెడ్డి,నీతా , మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా కాకతీయ హిందూ మహా సమ్మేళనం

