స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ… నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడటం, నామినేషన్ పత్రాలు చించివేయడం వంటి అరాచకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ‘అమిక్స్ క్యూరీ’ ని నియమించాలని, కేంద్ర బలగాలను మోహరించి పూర్తిస్థాయిలో వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో జరిగిన దాడులకు సంబంధించిన దృశ్యాలతో కూడిన ‘పచ్చమూకల దాడులు’ అనే పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు. ఎన్నికల సంఘం (SEC) కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు
స్థానిక పోరుపై జగన్ వ్యాఖ్యలు!

