హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దాలు, ప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎర్రబోడ, ఉప్పర్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, లంగర్‌హౌస్ ప్రాంతాల్లో ఈ భారీ శబ్దాలు వినిపించడంతో పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకుని పరిశీలించారు. ఈ శబ్దాలు మరియు ప్రకంపనలు ఏదైనా పేలుడు వల్ల సంభవించాయా లేక భూకంప సంబంధిత చర్యల వల్ల జరిగాయా అనేది ఇంకా స్పష్టం కాలేదని, వీటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
రాజేంద్రనగర్‌లో భారీ శబ్దాలు.. భయాందోళనలో స్థానికులు!

