హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతుడిని విశాఖపట్నంకు చెందిన రాజేష్‌గా మాదాపూర్ పోలీసులు గుర్తించారు. నాచారం పరిధిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ నగరంలోని ప్రైవేట్ ఐటీ సంస్థలో పని చేస్తున్న రాజేష్, సోమవారం మాదాపూర్‌లో ఉన్న తన స్నేహితులను కలిసిన అనంతరం కేబుల్ బ్రిడ్జి వద్దకు వచ్చి చెరువులోకి దూకాడని పోలీసులు తెలిపారు. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), డీఆర్‌ఎఫ్ (DRF) బృందాలు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహం కోసం వెతుకుతున్నాయి.
కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య..

