Breaking News

కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ

సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం

పటాన్‌చెరు, అక్టోబర్ 27 (E6 TV న్యూస్)

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు.

మంగళవారం సాయంత్రం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుతో కలిసి కేసీఆర్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని కేసీఆర్‌ను ఎమ్మెల్యే జీఎంఆర్ ఆహ్వానించారు.అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కేసీఆర్‌కు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *