పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండ
ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్ గౌడ్
ఎల్లారెడ్డి, అక్టోబర్ 27 (E6tv న్యూస్).
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డుకు చెందిన మంగలి శకుంతలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటునందిస్తోందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించి ఆర్థికంగా అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, కౌన్సిలర్లు గాయత్రి, శ్యామ్, మహేశ్వరి, విద్యాసాగర్, మహమ్మద్ ఉన్నిస్, రఫిక్, దుంపల మంజుల, శంకర్, అటుకారి చంద్రన్న, సయ్యద్ గఫర్, భాగ్యవతి, సిద్ధి శ్రీధర్, తిరుపతి, శివానంద్, దశరథ్,కో-ఆప్షన్ సభ్యులు వసీం, వహీద్, పప్పు వెంకటి, అరుణ తదితరులు హాజరయ్యారు.

