బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్ సహా ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలోనూ ఆ పార్టీని ఓడించి బ్యాలెట్ ద్వారా బుల్లెట్ దింపామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాగ్‌పూర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ వంజారీ విజయం సాధించడం బీజేపీ సిద్ధాంతాలను విద్యావంతులు తిరస్కరించడానికి నిదర్శనమని పేర్కొన్నారు. వారణాసి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మోదీ తన వైఫల్యాలను అంగీకరించాలని, ధైర్యముంటే వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మూడంకెల సీట్లు కూడా రావని జోస్యం చెప్పిన మహేశ్ గౌడ్, ‘ఓట్ల దొంగతనం’ను నిరసిస్తూ నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే భారీ నిరసన ద్వారా తొలగించిన 13.3 కోట్ల ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు.
బ్యాలెట్‌తోనే బీజేపీకి చెక్ పెట్టాం: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్!

