Breaking News

మాధవ్‌నగర్ ఆర్‌ఓబీకి రూ. 8.68 కోట్ల అదనపు నిధులు మంజూరు చేయాలని వినతి

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి.. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు

అక్టోబర్ 29:(E6tv న్యూస్-శివ ఠాకూర్).

నిజామాబాద్ నగరంలోని మాధవ్‌నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ. 8.68 కోట్ల అదనపు నిధులు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతి అందజేశారు.

మాధవ్‌నగర్ ఆర్‌ఓబీ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు అదనపు పరిపాలనా మంజూరు అవసరమని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వినతిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆర్‌ఓబీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.మాధవ్‌నగర్ ఆర్‌ఓబీ నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అదనపు నిధుల మంజూరుతో నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *