Breaking News

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS అమలు

ఆగస్టు 2న పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

నిజామాబాద్, జూలై 30: E6 tv NEWS.

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (TTC) ఆగస్టు–2026 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్–163 కింద నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది.ఆగస్టు 2 (ఆదివారం) నిర్వహించే పరీక్షల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

పరీక్షల సమయం

ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు – ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్

మధ్యాహ్నం 2:00 నుంచి 3:00 గంటల వరకు – మెథడ్స్ ఆఫ్ టెక్నాలజీ (జనరల్)

మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల వరకు – మెథడ్స్ ఆఫ్ టెక్నాలజీ (స్పెషల్)

    అమలులో ఉండే నిబంధనలు

    పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదు.నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సంచరించరాదు.

    నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సంచరించరాదు.

    పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు ఆగస్టు 2 ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు మూసివేయాలి.

      ఈ నిషేధాజ్ఞలు ఆగస్టు 2 ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనరేట్ స్పష్టం చేసింది. ప్రజలు, పరీక్షార్థులు మరియు నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *