ఏర్గట్ల, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్).
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి, టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేసి, సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్, మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, కేఎంసీ డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యవర్గ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

